- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అప్పటివరకూ ఆర్థిక పునరుద్ధరణ కష్టమే’
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి గతంలో సంభవించిన మాంద్యాలకంటే భిన్నమైనదని గోల్డ్‌మన్ శాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రాచీ మిశ్రా అభిప్రాయపడ్డారు. బిజినెస్ టుడే ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ, రికవరీ టాస్క్ అంశాలపై స్పందిస్తూ.. ఇదివరకు మనం ఎదుర్కొన్న మాంద్యాలు ఈ స్థాయిలో ఆందోళనను కలిగించలేదని, కరోనా వాటికి మించిన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోందని తెలిపారు. అయితే, గ్లోబల్ రికవరీ ప్రారంభమైందని, ఆదాయాలు స్థిరంగా ఉన్నాయని ప్రాచీ మిశ్రా పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు మందగించినట్టు కనిపించినప్పటికీ సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని, కరోనా వైరస్‌కు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అభివృద్ధి జరిగే వరకు ఆర్థిక పునరుద్ధరణ చాలా కష్టమైనదిగా ఉంటుందని ఆమె చెప్పారు.
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు చాలా సమయం పడుతుందని, ఇలాంటి అసాధారణ సమయాల్లో అభివృద్ధి త్వరగా మందగిస్తుందని మిశ్రా తెలిపారు. అలాగే, భారత్‌లో జనాభా పరంగా గమనిస్తే.. ఇక్కడి పరిస్థితి వేరుగా ఉందన్నారు. పలు ఆర్థిక సూచికల ప్రకారం.. ఆర్థిక వ్యవస్థ 75 శాతం కొవిడ్-19కి ముందుస్థాయిలకి తిరిగి వచ్చినట్టు చూపిస్తున్నాయన్నారు. కానీ, రానున్న రోజుల్లో మరిన్ని స్థూల ఆర్థిక విధానాలను అమలు చేయగలిగితేనే రికవరీ వేగంగా ఉండొచ్చని ప్రాచీ మిశ్రా అభిప్రాయపడ్డారు. క్రెడిట్, ఫైనాన్స్ విభాగాల్లో మహిళల పాత్ర గురించి మాట్లాడిన ఆమె..ఇటీవలి పరిశోధనల ప్రకారం వారు తక్కువ శాతంలో డీఫాల్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.