- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోర్గాన్ ఫామ్‌పై ఈసీబీ ఆందోళన
దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానున్నది. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీలో వెస్టిండీస్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నది. అయితే ఈ టోర్నీలో ఇంగ్లాండ్ గెలిస్తే ఒక అరుదైన రికార్డును సృష్టించనున్నది. ఓకే సారి వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా ఉన్న ఏకైక జట్టుగా ఇంగ్లాండ్ నిలవనున్నది. కానీ ఇంగ్లాండ్ జట్టు పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
ఆ జట్టులో కీలకమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్‌కు దూరమయ్యారు. అదే సమయంలో జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫామ్‌లో లేకపోవడం ఈసీబీకి ఆందోళన కలిగిస్తున్నది. రెండు రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు చేరినా.. చాంపియన్ కాలేక పోయింది. జట్టులో అందరూ మంచి ఫామ్‌లో ఉన్నా.. ఇయాన్ మార్గాన్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. అతడు ఫామ్‌లో లేకపోవడం వల్ల కేకేఆర్ భారీ మూల్యం చెల్లించుకున్నది. ఇప్పుడు అతడి ఫామ్ లేమి ఇంగ్లాండ్ జట్టుకు భారంగా మారనున్నది. ఇప్పటికిప్పుడు జట్టును మార్చే పరిస్థితి కూడా లేదు. మోర్గాన్ ఫామ్‌లో లేకపోడంతో జాస్ బట్లర్, బెయిర్‌స్టో పైనే ఆశలు పెట్టుకున్నది.