- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ పర్యటనకు ఈసీబీ గ్రీన్ సిగ్నల్
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌లో పాకిస్తాన్ జట్టు పర్యటనకు ఈసీబీ పచ్చ జెండా ఊపింది. 10మంది క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో పర్యటన జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. కాగా, కొన్ని షరతులతో పాక్ పర్యటనకు ఈసీబీ సుముఖత వ్యక్తం చేసింది. ఆదివారం లాహోర్ నుంచి ప్రత్యేక విమానం మాంచెస్టర్‌కు బయలుదేరుతుంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు ఎవరూ విమానం ఎక్కరాదని ఈసీబీ షరతు విధించింది. అంతేకాకుండా వోర్సెస్టర్‌లోని బ్లాక్‌ఫించ్‌లో పాక్ జట్టు 14 రోజులపాటు క్వారంటైన్‌లో తప్పక ఉండాలి. ఆ తర్వాత వారిని జూలై 13న డర్బిషైర్‌లోని ది ఇంకోరా కౌంటీ గ్రౌండ్‌కు తరలిస్తారు. అక్కడ పాకిస్తాన్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిస్తారు. పర్యటనకు వచ్చిన సిబ్బంది, ఆటగాళ్లు అందరికీ ఇంగ్లండ్‌లో రెండుసార్లు కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. కాగా, పాకిస్తాన్ క్రికెటర్లకు చేసిన కరోనా టెస్టుల ఫలితాలు శనివారం రానున్నాయి. దీని ఆధారంగా ఎవరు పర్యటనకు వెళ్తారు? ఎవరు ఆగిపోతారనే విషయం స్పష్టం కానుంది.