బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఓకే చెప్పిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్

by Shyam |
Team India
X

దిశ, స్పోర్ట్స్: కీలకమైన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కి ముందు టూర్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తికి ఈసీబీ సానుకూలంగా స్పందించింది. గతంలో ఎలాంటి టూర్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం లేదని.. టీమ్ ఇండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుకోవాలంటూ ఈసీబీ సూచించింది. అయితే సరైన మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టూర్ మ్యాచ్‌లు అయితేనే బాగుంటుందని బీసీసీఐ భావించి ఈ మేరకు ఈసీబీని విజ్ఞప్తి చేసింది. బోర్డు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి కోహ్లీ సేనకు రెండు టూర్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయడానికి ఈసీబీ నిర్ణయించింది.

ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఇంగ్లాండ్‌లో సెలవులను ఎంజాయ్ చేస్తున్న టీమ్ ఇండియా క్రికెటర్లు జులై 15న అందరూ దుర్హమ్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో తిరిగి కలుసుకుంటారు. అదే కౌంటీలో ఉన్న ఎమిరేట్స్ రివర్‌సైడ్ క్రికెట్ స్టేడియంలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నది. ఒక నాలుగు రోజుల మ్యాచ్, మరొక మూడు రోజుల మ్యాచ్ జరుగనున్నది. అయితే ఏయే కౌంటీలతో ఈ మ్యాచ్‌లు జరుగుతాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దుర్హమ్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత అగస్టు 1న జట్టంతా తొలి టెస్టు జరుగనున్న ట్రెంట్‌బ్రిడ్జ్‌కు ప్రయాణం అవుతారు.

Advertisement

Next Story

Most Viewed