ఈసీ నిర్ణయం ఎలా ఉంటుందో.. టెన్షన్ టెన్షన్

by Shamantha N |
ఈసీ నిర్ణయం ఎలా ఉంటుందో.. టెన్షన్ టెన్షన్
X

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై దాడి వ్యవహరంలో ఈసీ తన నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఈసీ ఇప్పటికే రెండు నివేదకలను తెప్పించుకుంది. దాడి జరిగినట్టు టీఎంసీ నేతలు చెబుతుండటం.. సింపతి కోసం అంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పూర్తి వివరాలతో కూడిన నివేదికను సీఎస్ నుంచి ఈసీ తెప్పించుకుంది. మరో వైపు ఎన్నికల పరిశీలకులను పంపించి అక్కడి విషయాలపై మరో నివేదికను తెప్పించుకుంది.

కాగా ఎన్నికల సంఘం పంపించిన పరిశీలకుల బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అది ప్రమాదవ శాత్తు జరిగిన ఘటన మాత్రమేనని అని పరీశీలకుల బృందం తెలిపింది. ఆమెపై దాడి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పరిశీలకుల బృందం శనివారం నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ వ్యవహారంపై ఈసీ సీరియస్‌గా ఉంది. ఇప్పుటికే రెండు నివేదికలు ఎన్నికల సంఘం వద్దకు చేరాయి. ఆ రెండు నివేదికలను ఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వీటి ఆధారంగా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే ఈసీ నిర్ణయం ఎలా ఉండబోతుంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed