- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యోగికి ఈసీ నోటిసు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ఈసీ కొరడా ఝలిపిస్తోంది. గురువారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈ మేరకు చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. ప్రచారంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు నోటీసు జారీ చేసింది. కాగా, షహీన్‌బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారికి కేజ్రీవాల్ బిర్యానీ అందజేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఓ వైపు అభివృద్ధి, జాతీయవాదం కోసం కృషి చేస్తున్న మోదీ నాయకత్వం ఉందని, మరోవైపు విభజన శక్తులకు మద్దతిచ్చే కాంగ్రెస్, కేజ్రీవాల్ నాయకత్వం ఉందని ఎవరికి ఓటు వేస్తారో తేల్చుకోవాలని ప్రజలకు యోగి సూచించారు. ఈ వ్యాఖ్యలపై ఈ నెల 7సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నికల కమిషన్ గురువారం ఆదేశించింది.