హనుమాన్ ఆయుధ విగ్రహానికి భూమి పూజ

by  |
హనుమాన్ ఆయుధ విగ్రహానికి భూమి పూజ
X

దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మాచిన్‌పల్లి గ్రామంలో 90 అడుగుల హనుమాన్ ఆయుధ విగ్రహానికి గ్రామస్తులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ విగ్రహాన్ని పంచలోహ విగ్రహంతో, ఒక లక్ష ఎనిమిది వేల గదలతో తయారు చేయడం జరుగుతుందని తెలిపారు.

అయోధ్యలో రామజన్మభూమి భూమి పూజ జరిగిన సమయంలోనే ఇక్కడ భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తరతరాలుగా ఉండిపోయే ఈ గొప్ప విశిష్ట గలిగిన విగ్రహ ఏర్పాటుకు తమవంతు బాధ్యతగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇక్కడ గతంలో నిర్మించిన గంట హనుమాన్ విగ్రహానికి వైబ్రేషన్ వలన గంట ఊడిపోయే ప్రమాదం ఉంటుందని, పేరు మార్చాలని గతంలో పరిపూర్ణనందా స్వామి తెలిపారని, దాని మూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1992 అయోధ్య కరసేవకులు ఆరుగురితో పాటు గ్రామస్తులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed