ఈరోజు నుండే ఎంసెట్ ఎగ్జామ్స్ 

by Anukaran |   ( Updated:2020-09-08 21:18:11.0  )
ఈరోజు నుండే ఎంసెట్ ఎగ్జామ్స్ 
X

దిశ, వెబ్ డెస్క్: ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్ టెస్ట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. 9, 10, 11, 14 తేదీల్లో ప్రతిరోజూ రెండు విడతల చొప్పున మొత్తం 8 విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… తెలంగాణలో 79, ఏపీలో 23 చొప్పున మొత్తం 20 టెస్ట్‌ జోన్లలో 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు విద్యాశాఖఅధికారులు.

ఒక్కో కేంద్రంలో విద్యార్థుల సంఖ్య సుమారు 100 నుండి 150 వరకు ఉండనుంది. మొత్తం 8 సెషన్లలో ప్రతి సెషన్‌కి దాదాపు 17వేల మంది హాజరు అవ్వనున్నారు. ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12గం.ల వరకు, మధ్యాహ్నం 3గం.ల నుండి సాయంత్రం 6గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం దాటినా అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.

కాగా, తమకు కరోనా లేదన్న సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం సమర్పించాలని విద్యార్థులకు సూచించారు. కొవిడ్‌ లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే పాజిటివ్‌ అని ముందుగా తెలిపిన విద్యార్థులకు చివర్లో ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు అధికారులు.

Advertisement

Next Story