Lockdown Rules: మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ తప్పనిసరి..!

by Anukaran |
Lockdown Rules: మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ తప్పనిసరి..!
X

దిశ, నల్లగొండ : అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్‌‎డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని డీఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల పోలీసులు జారీ చేసిన ఈ-పాస్‌‌లు ఉంటేనే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. అంబులెన్సులకు ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రైవేట్ వాహనాల్లో ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చే కొవిడ్, ఇతర రోగులు.. ఆసుపత్రుల నుంచి జారీ చేసిన లెటర్స్, అందుకు సబంధించిన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలన్నారు.

అదే విధంగా లాక్‌డౌన్ మినహాయింపు సమయంలోనూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విధిగా ఈ-పాస్ కలిగి ఉంటేనే అనుమతిస్తామని.. ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే వారు పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు. సరిహద్దుల వద్ద ఈ పాస్ లేకుండా వచ్చి ఇబ్బందులు పడొద్దని హితవు పలికారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాస్ పొందలేని వారు సరైన ఆధారాలు చూపిస్తే.. మానవతా దృక్పథంతో అనుమతిస్తామని డీఐజీ రంగనాధ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story