- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ- ఆఫీసు విధానంతో పారదర్శకత
by Shyam |

X
దిశ, సూర్యాపేట: జిల్లాలో ఇకపై ఈ- ఆఫీసు విధానాన్ని అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఈ-ఆఫీసు విధానాన్ని అదనపు కలెక్టర్ డి.సంజీవరెడ్డితో ప్రారంభించారు కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ-ఆఫీసులో పారదర్శకత ఉంటుందన్నారు. జిల్లాలో మొదటగా కలెక్టరేట్ కార్యాలయంలో అమలు చేస్తున్నామని..త్వరలో అన్ని కార్యాలయాలకు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ-ఆఫీసు ద్వారా ఫైల్స్ త్వరగా క్లియర్ అవుతాయని.. మిస్సింగ్‌కు అవకాశాలు ఉండవన్నారు. ఈ- ఆఫీస్‌పై వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పిస్తామన్నారు.
Next Story