హైదరాబాదీల ఆన్లైన్ ఆర్డర్స్ లో టాప్ .. ‘ఐ-పిల్’

by vinod kumar |   ( Updated:2023-05-19 13:24:21.0  )
హైదరాబాదీల ఆన్లైన్ ఆర్డర్స్ లో టాప్ .. ‘ఐ-పిల్’
X

దిశ వెబ్ డెస్క్: కరోనా కారణంగా దుకాణాలన్నీ మూతపడ్డాయ్. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు అందించేవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. ఫుడ్ డెలివరీ యాప్స్, ఈ కామర్స్ సైట్స్ ఏవీ కూడా ఆర్డర్లు తీసుకోవడం లేదు. అయితే.. లాక్‌డౌన్ వ‌ల్ల ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ యాప్స్ అన్నీ కూడా నిత్యావ‌స‌రాల‌ను కూడా డెలివ‌రీ చేస్తున్నాయి. ఇందులో ‘డుంజో’ కూడా ఒకటి. డుంజో గ‌త నెల(మార్చి)లో జ‌నాలు ఫార్మ‌సీకి సంబంధించి ఏ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం మన హైదరాబాదీలు గర్భనిరోధక మాత్రలకు ఎక్కువగా ఆర్డర్ చేశారు. మరి ముంబై, బెంగళూరు వాసులు వేటికి టాప్ ప్లేస్ ఇచ్చారో తెలుసుకుందాం.

దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో .. నగర వాసులు గ్రాసరీ వస్తువులను, మందులను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. దాదాపు అన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ తో పాటు, సూపర్ మార్కెట్లు, ఈ కామర్స్ సంస్థలు డోర్ డెలివరీ సేవలను అందిస్తున్నాయి. దాంతో అన్ని వస్తువులకు ఆన్ లైన్ కేరాఫ్ గా మారింది. ఆ క్రమంలోనే .. చెన్నై, జైపూర్‌వాసులు హ్యాండ్‌వాష్‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశారు. కరోనాను నియంత్రించాలంటే.. ప్రతి ఒక్కరు శుభ్రంగా చేతులు కడుక్కోవడంతో పాటు, శానిటైజర్ ఉపయోగించాలని ప్రభుత్వాధికారులతో పాటు, వైద్యులు కూడా చెప్పడంతో .. శానిటైజర్ ను చాలా మంది కొనుగోలు చేశారు. అయితే అందరికంటే చెన్నై. జైపూర్ వాసులు శుభ్రతకు పెద్దపీఠ వేసినట్లు తెలుస్తోంది. బెంగ‌ళూరు, పుణె న‌గ‌రాల్లో ప్రెగ్నెన్సీ కిట్ల‌ను అధికంగా ఆర్డర్ చేశారు. ముంబై నగర వాసుల విషయానికి వస్తే.. వాళ్లు ఆర్డ‌ర్ చేసిన‌ వాటిలో కండోమ్స్ మొద‌టి స్థానంలో ఉన్నాయి. ఇక హైద‌రాబాద్ విష‌యానికొస్తే మ‌న భాగ్య‌న‌గ‌ర వాసులు ఐ-పిల్‌ అనే గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ను అధికంగా ఆర్డర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed