నేను చనిపోతున్నా.. కనీసం నా పిల్లలకైనా ఆ భూమి చెందాలి (వీడియో)

by Shyam |   ( Updated:2023-12-15 17:21:43.0  )
dumpala sampath
X

దిశ, దేవరుప్పుల: భూమి విషయంలో న్యాయం చేయాలని బాధితుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. దేవరుప్పల గ్రామానికి చెందిన తోటకూరి సోమయ్య వద్ద 2002లో అదే గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ దుంపల సోమయ్య అనే వ్యక్తి ఐదెకరాల భూమి కొనుగోలు చేశాడు. అనంతరం ఆ భూమి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ధరణి మూలంగా సాదాబైనామాలో భూమిని దుంపల సోమయ్య, అతని కుమారుడు సంపత్ పేరు మీదకు నమోదు చేయించుకున్నాడు. దాదాపు 2018 వరకు ఆ భూమి వీరి పేరుమీదే ఉంది.

అయితే, ఇటీవల భూముల రేట్లు పెరగడంతో ప్రశాంతి స్కూల్ ప్రిన్సిపాల్ తోటకూరి పాండు మరియు తీగల సత్తయ్యలు డబ్బులకు ఆశపడి దుంపల సోమయ్యకు భూమి అమ్మిన తోటకూరి సోమయ్యను ప్రలోభ పెట్టారు. అమ్ముకున్న నీ భూమి నీకు ఇప్పిస్తామని అతని చేత డబ్బులు ఖర్చు పెట్టించి మా పేరుపై ఉన్న భూమిని అధికారుల సాయంతో వారి పేరుమీద మార్చుకున్నారని సోమయ్య కుమారుడు సంపత్ ఆరోపిస్తున్నారు. వారి బెదిరింపులు తాళలేక మా నాన్న చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. దయచేసి మా పిల్లలకైనా ఆ భూమి దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దుంపల సంపత్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.

Advertisement

Next Story

Most Viewed