- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవుకు అంత్యక్రియలు
దిశ, వెబ్‌డెస్క్: నోరు తెరిచి మాట్లడలేని మూగజీవి. అయితేనేం గ్రామంలో ఇంటింటికి తిరిగి అందరికీ దగ్గరయింది. ఆ గోవుది , ఊరివాళ్లది 20 ఏళ్ల అనుబంధం..! గ్రామస్తులంతా దానిని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. తోటి మనుషులను జంతువుల కన్నా హీనంగా చూసే ఈ రోజుల్లో కూడా.. ఓ జంతువును కుటుంబ సభ్యుడిలా అక్కున్న చేర్చుకున్నారు. అందుకే ఆ గోవును మరణ వార్తను విని.. ఊరు ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మనిషికి నిర్వహించినట్లుగానే.. గ్రామస్తులంతా కలిసి ఆవుకు కూడా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో ఓ ఆవుకు స్థానికులతో 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఐతే ఊరంతా అల్లారుముద్దుగా చూసుకునే హనుమండ్ల ఆవు అనారోగ్యంతో మరణించింది. తమ ఇంటి కుటుంబ సభ్యుడే చనిపోయినట్లుగా అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆవుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుపెట్టుకున్నారు. ఆ ఆవుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, ఉప సర్పంచ్ అశోక్ , గ్రామస్తులు లక్ష్మిపతి తదితరుల ఆధ్వర్యంలో ఆవుకు అంత్యక్రియలు నిర్వహించి.. కన్నీటి వీడుకోలు పలికారు. అంతేకాదు దేవతగా కొలిచే ఆ గోవుకు గ్రామంలో గుడి కట్టాలని నిర్ణయించారు.