దుల్కర్ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ

by Jakkula Samataha |
దుల్కర్ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ
X

దుల్కర్ సల్మాన్ పుట్టినరోజున అభిమానులకు సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది స్వప్న సినిమాస్ నిర్మాణ సంస్థ. దుల్కర్ తర్వాతి చిత్రాన్ని ప్రకటిస్తూ బర్త్‌‌డే విషెస్ అందించింది. ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ సినిమాలో దుల్కర్.. లెఫ్టినెంట్ రామ్‌గా కనిపించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. ప్రియాంక దత్ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. వైజయంతి మూవీస్ సమర్పిస్తున్న ఈ సినిమా.. 1964లో జరిగిన ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతోంది.

ఉత్తరం ద్వారా జరిగే ప్రేమ కథకు సంబంధించిన వివరాలను ఉత్తరంపై ముద్రించి మరీ సరికొత్తగా సినిమాను అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్. ఇది దుల్కర్‌కు తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ కాగా.. మలయాళం, తమిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. భుజంపై తుపాకీతో ఉన్న దుల్కర్ ఫొటోను హైలైట్ చేస్తూనే.. ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం గురించి తెలుపుతూ చేతిలో చేయి వేసిన అమ్మాయి, అబ్బాయి చేతులను ఫొటోలో చూపించారు.

Advertisement

Next Story