- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బర్డ్‌ఫ్లూ కల్లోలం.. 1800 బాతులు మృత్యువాత
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కల్లోలం ఉండగానే మరో వ్యాధి చాపకింద నీరులాగా అన్ని రాష్ట్రాలను చుట్టేస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను బయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ కేరళ, హిమాచల్ ప్రదేశ్‌నూ వణికిస్తోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌కు వలస వచ్చిన అరుదైన నీటిపక్షులు సహా 1800 బాతులు మృత్యుపడ్డాయి. వాటి మృతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతిచెందిన పక్షుల నమూనాలు సేకరించి వివిధ లేబొరేటరీలకు పంపారు. దీనిపై వన్యప్రాణుల సంరక్షణ అధికారి ఉపాసన పట్యాల్ మాట్లాడుతూ… ‘పక్షులు మృతి చెందడానికి బర్డ్‌ఫ్లూయే కారణమని భావిస్తున్నాం. రేపు సాయంత్రానికల్లా పరీక్షా ఫలితాలు వస్తాయి. ప్రోటోకాల్ ప్రకారం మేము ఇప్పటికే పోంగ్ వెట్‌ల్యాండ్స్ వద్ద నిషేధాజ్ఞలు విధించాం..’ అని అన్నారు. తాజాగా కాంగ్రా జిల్లాలోని ఈ మానవ నిర్మిత సరస్సు వద్ద పక్షులు అనుమానాస్పందంగా మృతిచెందడంతో.. దీనికి 10 కిలోమీటర్ల లోపు ఎవరూ వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు.