ప్రజలు మార్పు కోరుతున్నారు

by Aamani |
ప్రజలు మార్పు కోరుతున్నారు
X

దిశ, దుబ్బాక : దుబ్బాక ప్రజలు మార్పును కోరుకుంటున్నారనీ, గత పాలకుల వల్ల జరిగిన అన్యాయం మళ్లీ జరగకుండా ఉండేందుకు కొత్త నాయకత్వం కావాలనే తపన ఇక్కడి ప్రజల్లో ఉందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దుబ్బాక ప్రజలు ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడి ప్రాంతం వెనుకబడి పోయిందనీ, అది పూడ్చడానికి సరైన నాయకుడు రఘునందన్ రావు మాత్రమేనని బాబు రావు అన్నారు. మంత్రి హరీశ్ రావుకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు.



Next Story

Most Viewed