దుబ్బాకలో బీజేపీ హవా

by Shyam |   ( Updated:10 Nov 2020 1:01 AM  )
దుబ్బాకలో బీజేపీ హవా
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల జోరు తగ్గింది. బీజేపీ మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార పార్టీని వెనకకు నెట్టి లీడ్ లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర నాయకత్వం ప్రచారం చేసినా బీజేపీని కనీసం టచ్ చేయలేని విధంగా ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు సిట్టింగ్ స్థానం తమదే అనుకున్న టీఆర్ఎస్ కు ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు మింగుడు పడడం లేదు. బీజేపీ అభ్యర్థికి ప్రతి రౌండ్ లోనూ ఆధిత్యం పెరుగుతుందే తప్పా.. తగ్గడం లేదు. ఐదో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఐదో రౌండ్‌లో బీజేపీకి 16,517, టీఆర్ఎస్‌కు 13,497, కాంగ్రెస్‌కు 2,724 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి 3020 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కాగా ఇప్పటి వరకు 35,996 ఓట్లను లెక్కించారు. ఇప్పటివరకు నోటాకు 116 ఓట్లు పోలయ్యాయి.

Advertisement

Next Story