తారుమారవుతున్న దుబ్బాక ఫలితాలు

by Shyam |   ( Updated:2020-11-10 11:37:25.0  )
తారుమారవుతున్న దుబ్బాక ఫలితాలు
X

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాకలో క్రమంలో ఫలితాలు తారుమారు అవుతున్నాయి. మొదటి నుంచి ఐదు రౌండ్ల వరకు ఆధిత్యం కొనసాగిన బీజేపీ.. ఆరో రౌండ్ నుంచి వెనకబడిపోయింది. అప్పటి వరకు సెకండ్ లీడ్ లో ఉన్న టీఆర్ఎస్.. క్రమంలో బలం పుంజుకుంటుంది. బీజేపీ ఆధిక్యానికి గండికొడుతూ.. ముందుకు దూసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం దుబ్బాక ఫలితం కోలుకోలేని విషాదాన్ని మిగిల్చేలా వస్తున్నాయి. ఎనిమితో రౌండ్ లోనూ టీఆర్ఎస్‌కు 200 ఆధిక్యం వచ్చింది. కారు గేరు మార్చడంతో బీజేపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. కాగాహరీష్ రావు దత్తత గ్రామమైన చీకుడులో టీఆర్ఎస్‌కు 744, బీజేపీకి 766 ఓట్లు పోలయ్యాయి. అక్కడ బీజేపీకి 22 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

కాగా ఎనిమిదో రౌండ్‌లో బీజేపీకి 25,878, టీఆర్ఎస్‌కు 22,772, కాంగ్రెస్‌కు 5,125 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి 3106 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 59,655 ఓట్లను లెక్కించారు. నోటాకు 224 ఓట్లు పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్‌కు 1008, బీజేపీకి 492 ఓట్లు పోలయ్యాయి

Advertisement

Next Story

Most Viewed