పావురాలు..బెంజ్ కారు..ఇంట్రెస్టింగ్ స్టోరీ

by  |
పావురాలు..బెంజ్ కారు..ఇంట్రెస్టింగ్ స్టోరీ
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఇంటి పెరట్లో..బోలెడు పక్షులు ఆడుకునేవి. అవి అక్కడి చెట్ల మీద గూళ్లు పెట్టుకుని ఎంచక్కా ఉండేవి. ఇక పిట్టలైతే.. ఇంట్లో గూడు పెట్టిన సందర్భాలు చాలానే ఉంటాయి. పావురాలు కూడా వచ్చేవి. వాటికి గింజలు వేస్తూ.. వాటితో కాసేపు గడిపేవారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పక్షులు, పిట్టలు, కనిపించకుండా పోయాయి. అయితే, నగరాల్లో మాత్రం అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. చాలామంది నగరవాసులు వాటికి గింజలు వేసేందుకు రోజూ వెళ్తుంటారు కూడా. పక్షులపై అంతో ఇంతో ప్రేమ చూపుతూ..వాటికి బాసటగా నిలుస్తున్నారు. తాజాగా దుబాయ్ షేక్ రషీద్ పావురాలపై అపారమైన ప్రేమను చాటి నెటిజన్ల మనసు దోచుకున్నారు. ఆ కథేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

పక్షులు గుడ్లు పెట్టడం కామన్. అవి గుడ్లు పెట్టేందుకు సురక్షితమైన ప్లేస్‌ను వెతుక్కుంటాయి. ఈ క్రమంలోనే.. అవి గూడు కోసం వెతకసాగాయి. సరిగ్గా.. వాటికి ఓ బెంజ్ కారు భలే నచ్చేసింది. ఇంకేం అందులో అవి గూడు పెట్టేశాయి. గూడుతో పాటే.. గుడ్లు కూడా పెట్టాయి. వాటిని జాగ్రత్తగా పొదిగాయి. ముద్దుముద్దుగా ఉండే పావరాల పిల్లలు వచ్చాయి. పావురాలు జీవితం ఇలా సంతోషంగానే సాగుతోంది. ఇంతలోనే ఆ కారు యజమాని అటు పక్కగా వచ్చాడు. ఆ పావురాల పిల్లల్ని చూసి .. మురిసిపోయాడు. ఇంతకీ ఆ యజమాని ఎవరో కాదు.. దుబాయి క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్దుమ్. అది అతడు ఇష్టంగా కొనుక్కున్నా బెంజ్ కారు. కానీ, పావురాలను చూసి రషీద్.. ఆ కారును ఆ పావురాలకు ఇచ్చేశాడు. అంతేకాదు. ఆ పావురాలకు ఎలాంటి హానీ జరగకుండా..ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా ఆ కారు చుట్టూ రెడ్ టేప్‌తో బంధించాడు. కారుపై ఉన్న గూడుకు ఎండ తగలకుండా వర్షం వస్తే తడవకుండా ఉండేలా టార్పాలిన్ కూడా కట్టించాడు ఆ వీడియోను రషీద్ తన ఇన్‌స్టావాల్‌పై పోస్ట్ చేయడంతో నెటిజన్లు రషీద్ చేసిన పనికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


Next Story

Most Viewed