సౌమ్య సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు :డీఎస్పీ

by srinivas |
సౌమ్య సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు :డీఎస్పీ
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా కొర్రపాడులో విద్యార్థిని సౌమ్య మృతి కేసుపై డీఎస్పీ జెస్సీ ప్రశాంతి స్పందించారు. సౌమ్య ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా సౌమ్యను వరప్రసాద్ అనే యువకుడు ప్రేమించాలాంటూ వేధించేవాడన్నారు. వరప్రసాద్‌పై పోక్సో చట్టం 306,354 డి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తుందని జెస్సీ ప్రశాంతి పేర్కొన్నారు.


Next Story