- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో ఈత కొడదామని బావిలో దూకాడు.. తర్వాత ఏమైందంటే..!
దిశ, మర్పల్లి : మద్యం మత్తులో బావిలో దూకి ఒక యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మోమిన్ పేట సీఐ వెంకటేశం కథనం ప్రకారం.. మోమిన్ పేట మండలం అమ్రాదికలాన్ గ్రామానికి చెందిన బేగరి ఆనందం (25) శుక్రవారం ఉదయం వారి స్నేహితులు ఫోన్ చేయటంతో బయటకు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో మామయ్యలు శంకరయ్య, మాణెయ్య, బావ తుల్జారాంలు వెతకగా అదే గ్రామానికి చెందిన రాచప్ప పటేల్ బావి దగ్గర నా భర్త చెప్పులు కనిపించాయని మృతుని భార్య బేగరి శ్రీవిద్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, ఉదయం మృతుని ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా మృతుడు బేగరి ఆనందంతో పాటు దండు అనిల్, వనంపల్లి ప్రమోద్, నంది గారి వినేకర్, దండు ఎల్లయ్య, గొల్ల వెంకటేష్, కొత్తపల్లి శివ కుమార్ తదితరులు కలిసి మోమిన్పేటకు వెళ్లి మద్యం కొనుగోలు చేశారు. మరల అమ్రాది కలాన్ గ్రామ శివారులో మద్యం తాగి బావిలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో బావిలో దూకగా ఆనంద్ మునిగిపోయాడని, ఎంత వెదికినా పైకి రాలేదని తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేష్ తెలిపారు.