జీడీపీ క్షీణతపై కేవీ కీలక వ్యాఖ్యలు 

by  |
జీడీపీ క్షీణతపై కేవీ కీలక వ్యాఖ్యలు 
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా దేశ జీడీపీ (GDP) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కృంగిపోయింది. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ఆగిపోవడంతో ఊహించిన స్థాయిలో పతనం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ తెలిపారు.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు పరిమిత స్థాయిలో కొనసాగాయి. అందుకే జీడీపీ గణాంకాలు దిగజారాయని, ఇతర దేశాల్లోనూ ఇదే స్థాయి క్షీణత నమోదైనట్టు గుర్తించాలని సుబ్రమణియన్ పేర్కొన్నారు. జూన్ నెల నుంచే ప్రభుత్వం అన్‌లాక్ దశను అమలు చేసింది.

కార్యకలాపాల కోసం సడలింపులు ఇవ్వడంతో భారత్ కోలుకునే దశలో ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగుదలను నమోదు చేస్తోంది. లాక్‌డౌన్ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో గణాంకాలు మెరుగ్గా నమోదవుతున్నాయి. రవాణా పుంజుకుంది. విద్యుత్ వినియోగం వృద్ధి చెందింది. ఈ-వే బిల్లులు భారీగా పెరిగాయి. ఈ పరిణామాలను పరిశీలిస్తే రికవరీకి సంకేతంగా భావించవచ్చని సుబ్రమణియన్ వెల్లడించారు.


Next Story

Most Viewed