డ్రోన్ల సాయంతో కరోనా సమాచారం

by  |
డ్రోన్ల సాయంతో కరోనా సమాచారం
X

కరోనా వైరస్ ప్రతీ ఒక్క దేశాన్ని ప్రభావితం చేసింది. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో తగ్గుముఖం పడుతోంది. అయితే దగ్గరుండి కరోనా పోరాటంలో పాల్గొన్న వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయమిది. అందుకే భారత దేశంలో హెలికాప్టర్ల ద్వారా పూలు చల్లి మెచ్చుకున్నారు. మరి దక్షిణ కొరియాలో డ్రోన్లతో ప్రదర్శన ఏర్పాటు చేసి చెప్పారు. అవును.. ఇందుకోసం 300ల డ్రోన్లను వారు ఉపయోగించారు. కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్లకు థ్యాంక్యూ చెప్పడమే కాకుండా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర సమాచారాన్ని ఈ డ్రోన్ ప్రదర్శన ద్వారా తెలియజెప్పారు.

సియోల్‌లోని హాన్ నది మీద ఈ డ్రోన్ ప్రదర్శన జరిగింది. ముందే ప్రోగ్రామ్ చేసిన ఈ డ్రోన్లు, లైట్ల మాదిరిగా వెలుగుతూ సమాచారాన్ని ప్రజలకు చేరవేశాయి. దీన్ని ‘డ్రోన్ ఆర్ట్ ఫ్లాష్ మాబ్‌’గా పిలుస్తారు. పది నిమిషాల పాటు జరిగిన ఈ ప్రదర్శనను భూమి, అవస్థాపన, రవాణా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రదర్శన గురించి ఆ మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. అలా చేస్తే ప్రజలందరూ గుంపులుగా కూడతారనే ఉద్దేశంతో ఇలా సర్‌ప్రైజ్‌గా అందరూ చూసేందుకు వీలు కలిగేలా డ్రోన్ ఫ్లాష్ మాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే దూరం ఉన్న వాళ్లు ఈ ప్రదర్శన చూడటానికి వీలుగా సోషల్ మీడియాల్లో లైవ్ స్ట్రీమ్ చేసింది. ఈ ప్రదర్శన వీడియోను మీరు కూడా యూట్యూబ్‌లో చూడొచ్చు.


Next Story

Most Viewed