తెలంగాణలో RTA అధికారుల నిర్లక్ష్యం.. ఆ పనిని సమర్ధించిన మంత్రి KTR

by Anukaran |
తెలంగాణలో RTA అధికారుల నిర్లక్ష్యం.. ఆ పనిని సమర్ధించిన మంత్రి KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో : నిత్యం వందలకొద్ది యాక్సిడెంట్స్ అవుతున్నా.. అధికారులు అప్రమత్తం కావడం లేదు. కొందరు ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యంతో వాహనం సరిగా నడపడం రాకపోయినా.. లైసెన్సులు జారీ అవుతున్నాయి. దీంతో ఆ వాహనదారులు రోడ్డెక్కేసి ప్రమాదాలకు కారకులుగా మారుతున్నారు. ఇది ఇలా ఉంటే.. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

ఆయన చేసిన ట్వీట్.. ‘‘UNBELIEVABLE in Telangana for RENEWAL of Driving License at this age of 66 yrs without visiting the RTA office physically I could renewal my Driving License the card is under printing My sincere thanks to our minister KTR Ji AMAZING GOD BLESS him n TELANGANA’’ అని ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయడానికి ఆన్‌లైన్‌లో అప్లై చేశానని, 66 ఏళ్ల వయస్సులోనూ.. ఆర్టీఏ అధికారులు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా లైసెన్సును జారీ చేశారంటూ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ RTA అధికారులపై మండిపడుతున్నారు. అభ్యర్థి ఫిట్‌గా ఉన్నారా.? లేదా.? అని చెక్ చేయకుండా ఎలా లైసెన్స్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన వారికి కంటి పరీక్షలు చేయకుండా ఎలా లైసెన్స్ రెన్యువల్ చేస్తారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story