- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాబ్స్‌లో రాసలీలలు.. డ్రైవర్లు ఎలా చేస్తున్నారంటే..?
దిశ, ఫీచర్స్: కట్టెకు చీరకట్టినా సరే అమ్మాయి అనుకుని అత్యాచారం చేసేందుకు వెనుకాడని మూర్ఖులున్న సమాజమిది. అలాంటిది నిజంగానే అమ్మాయే ఒంటరిగా దొరికితే వదిలిపెడతారా? అంటే చాలా సందర్భాల్లో కష్టమే. అయితే జనరేషన్ మారింది, మగాళ్ల బుద్ధిలోనూ మార్పొస్తుందనే ఆలోచనతో ఉన్న మహిళలు మాత్రం ధైర్యంగా ఒంటరిగా ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ‘ఓలా, ఉబెర్, రాపిడో, లిఫ్ట్, జూమ్ కార్’ వంటి యాప్స్ వినియోగిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా లైంగిక వేధింపులు ఎదురవడంతో.. సింగిల్ జర్నీలు మహిళల్ని పునరాలోచనలో పడేస్తున్నాయి. రైడింగ్ యాప్స్ ద్వారా ప్రయాణిస్తున్న మహిళలపై రోజురోజుకీ లైంగిక వేధింపులు, బెదిరింపులు ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది.
ఓ వైపు భర్త.. మరోవైపు ప్రియుడు.. చివరకు లవర్ తమ్ముడితో కలిసి..
ఫేమస్ యాప్స్ ‘ఓలా, ఉబెర్’లో రైడ్ బుక్ చేస్తే.. కస్టమర్ అడ్రస్, ఫోన్ నంబర్ సహా డీటెయిల్స్ అన్నీ యాప్‌లో ఫీడై అయిపోతాయి. సదరు కంపెనీల డ్రైవర్స్ కూడా ఈ డీటెయిల్స్ చూడొచ్చు. ఈ క్రమంలోనే అమ్మాయిల రైడింగ్ పూర్తయ్యాక.. కొందరు డ్రైవర్స్ ఆ నెంబర్లకు కాల్స్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. లేదంటే ఆ రైడ్ టైమ్‌లోనే వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బాడీ పార్ట్స్‌ను బ్యాడ్‌గా టచ్ చేస్తూ ఆ జర్నీని నరకంగా మారుస్తున్నారు. యూఎస్‌లో రైడ్ హెయిలింగ్ యాప్ ‘లిఫ్ట్’.. 2017-19 మధ్య సెక్సువల్ అసాల్ట్ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ పబ్లిష్ చేయగా.. 2017లో 1,096, 2018లో 1,255, 2019లో1,807 ఫిర్యాదులు అందినట్లు కంపెనీ తన నివేదికలో పేర్కొంది. వీటిలో పది దారుణమైన సంఘటనలు ఉన్నట్లు వివరించింది. ఇక 2018లో ఉబెర్ సంస్థకు ఇలాంటివే 3వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇండియాలో అయితే ఇలాంటి రైడ్స్‌పై బాధిత కస్టమర్లు సదరు యాప్‌లోనే ఫిర్యాదు చేసి ఊరుకుంటున్నారు. కానీ అమెరికా లాంటి కంట్రీస్‌లో మాత్రం న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. 2017లో డ్రైవర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లిఫ్ట్ యాప్‌పై దావా వేసిన న్యూయార్క్ నగర నివాసి అలిసన్ తుర్కోస్.. సెక్సువల్ అసాల్ట్ వల్లే తాను లిఫ్ట్ యాప్‌ను అవాయిడ్ చేశానని తెలిపింది. బిలియన్ డాలర్ల టెక్ కంపెనీ ఈ విషయంలో జవాబుదారీగా ఉండలేకపోతుందన్న ఆమె.. తను మాత్రం వెనక్కి తగ్గబోనని వివరించింది.
డబ్బు ఆశ చూపిన ఉబెర్..
ఇక 2018లో లైంగిక వేధింపులకు గురైన తొమ్మిది మంది బాధిత ఉమెన్ కస్టమర్లను సైలెంట్‌గా ఉంచేందుకు డబ్బు ఆశ చూపింది ఉబెర్. ఈ ఆరోపణలతో పాటు సెక్సువల్ అసాల్ట్‌కు సంబంధించిన రిపోర్ట్స్ సబ్మిట్ చేయడంలో ఫెయిల్ అయినందుకు.. కాలిఫోర్నియా రెగ్యులేటర్ ఉబెర్‌కు 59 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. మరోవైపు బేసిక్ సేఫ్టీ మెజర్‌మెంట్స్ అందించడంలో విఫలమైందని, వేధింపులను ఆపలేకపోయిందని.. లిఫ్ట్ సంస్థపై కూడా 2019లో 12 మంది మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. అయినా సరే కంపెనీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని పేర్కొన్నారు.
అయితే క్రిమినల్ డ్రైవింగ్ రికార్డులను చెక్ చేసిన తర్వాతే లిఫ్ట్ సంస్థ డ్రైవర్లను హైర్ చేసుకుంటుందని, తద్వారా 2017-2020 వరకు మూడేళ్ల కాలంలో లైంగిక వేధింపులు 19శాతం తగ్గాయని తన బ్లాగ్‌లో పేర్కొంది. 2017 నుంచి 2019 వరకు 99% కంటే ఎక్కువ రైడ్‌లు ఎటువంటి భద్రతా సంబంధిత సంఘటనలు లేకుండానే జరిగాయని కంపెనీ తెలిపింది. తమ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఘటనలు అరుదుగా జరుగుతున్నప్పటికీ.. ఇలాంటి ఒక్క ఘటన కూడా సీరియస్ ఇష్యూ అనే విషయాన్ని గ్రహించామని కంపెనీ పాలసీ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ హెడ్ జెన్నిఫర్ బ్రాండెన్‌బర్గర్ బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపారు.
- Tags
- cabs Drivers
- lift