తాగుబోతుల అడ్డాగా ‘డబుల్ ఇండ్లు’

by  |
తాగుబోతుల అడ్డాగా ‘డబుల్ ఇండ్లు’
X

దిశ, హుస్నాబాద్ :

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మందు బాబులకు అడ్డాగా మారాయని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కో-ఆర్టినేటర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బెజ్జంకి మండల కేంద్రంలో 2015 సంవత్సరంలో డబుల్ బెడ్ రూమ్స్‌కు శిలాఫలకం వేస్తే, 2017లో నిర్మాణం పూర్తి చేశారన్నారు. గత మూడేళ్ల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇండ్లు లేని లబ్ధిదారులను గుర్తించకపోవడంతో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని ఆయన ఆరోపించారు.

డబుల్ ఇళ్ల నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ఈ ప్రాంతంతో సాయంత్రమైతే తాగుబోతులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. తప్పతాగి బీరుసీసాలతో డబుల్ ఇండ్ల డోర్లు, కిటికీలకు బిగించిన గ్లాసులను ధ్వంసం చేస్తున్నారని వివరించారు. ఇప్పటికై జిల్లా ఉన్నాతాధికారులు, పాలకులు స్పందించి త్వరితగతిన అర్హులను గుర్తించి ఇండ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, తాగుబోతుల నుంచి విలువైన ఆస్తులను కాపాడాలని ఆయన కోరారు.



Next Story