చేతిలో నాటు బాంబు.. వీరంగం సృష్టించిన మందుబాబు

by srinivas |   ( Updated:2021-08-11 09:19:20.0  )
bomb in hand
X

దిశ, ఏపీ బ్యూరో: మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి బయట ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఎందుకంటే కడుపులో ఉన్నది తిన్నగా ఉండనీయదు. కొందరు మందు తాగి చిందేస్తే మరికొందరు అరుస్తూ కేకలు వేస్తూ నానా రభసా చేస్తారు. ఇలా మద్యం తాగిన వారి వేషాలు చెప్పుకుంటూ పోతే అన్నీ ఇన్నీకావు. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియక కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు ప్రాణాలు తీసిన పరిస్థితులు కూడా చూశాం. ఇలాంటి సంఘటనే చిత్తూరు లో జరిగింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో నానా రచ్చ చేశాడు.

చిత్తూరు జిల్లా పాకాల మండలం వాల్లివేడు గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కృష్ణయ్య ఫుల్‌గా మద్యం సేవించాడు. రోడ్డుపై తూలుతూ అడ్డొచ్చిన వారిని తిడుతూ నానా హంగామా చేశాడు. ఓ చేతిలో మందు బాటిల్ మరో చేతిలో ఓ సంచి తీసుకుని గట్టిగా అరుస్తూ వీధుల్లో హల్‌‌చల్ చేశాడు. బయటకు రాకుంటే బాంబులు వేస్తానని బెదిరించాడు. దీంతో అందరు పరుగులు పెట్టారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. చేతిలో బాంబు పట్టుకుని పరుగులు పెట్టాడు. చివరికి ఆ బాంబును ఓ ఖాళీ ప్రదేశంలోకి విసరడంతో అది పేలిపోయింది. అయితే అదృష్టవ శాత్తూ ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. తర్వాత స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాల్లివేడు వచ్చేసరికి కృష్ణయ్య నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed