- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నావల్ షిప్‌ల రక్షణకు చాఫ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో
by Shamantha N |

X
న్యూఢిల్లీ: శత్రువుల మిసైల్ అటాక్ నుంచి నావికా దళ నౌకలను రక్షించుకోవడానికి డీఆర్‌డీవో అధునాతన చాఫ్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. డిఫెన్స్ ల్యాబరేటరీ జోధ్‌పూర్ వీటిని స్వయంగా అభివృద్ధి చేసింది. షార్ట్, మీడియం, లాంగ్ రేంజ్ మూడు వేరియంట్లలో చాఫ్ రాకెట్‌లను దేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. డీఎల్‌జే మైలురాయిని ఆత్మనిర్భర భారత్‌వైపు కీలక అడుగుగా అధికారులు భావిస్తున్నారు. చాఫ్ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వినియోగిస్తున్నాయి. ప్రత్యర్థుల రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌లను చాఫ్ టెక్నాలజీ సమర్థవంతంగా అడ్డుకుంటుంది. మిసైల్‌ను పక్కదారి పట్టించి షిప్పులను రక్షిస్తాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డీఆర్‌డీవో చైర్మన్ జీ సతీశ్ రెడ్డి, నావల్ స్టాఫ్ వైస్ అడ్వైజర్ వైస్ చీఫ్ జీ అశోక్ కుమార్ డీఆర్‌డీవోపై ప్రశంసలు కురిపించారు.
Next Story