జువైనల్ జస్టిస్‌పై డ్రాఫ్ట్ కమిటీ

దిశ, న్యూస్‌బ్యూరో: జువైనల్ జస్టిస్ చట్టాలను బలోపేతం చేసి, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నివేదికను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఛైల్డ్ కేర్ యూనిట్స్ (సీసీయూ), ఛైల్డ్ వెల్పేర్ కమిటీ (సీడబ్లూసీ), ఇంటన్సెవ్ ఛైల్డ్ ప్రొటెక్షన్ సిస్టం (ఐసీపీఎస్)లను నిర్వహించేందుకు అవసరమైన సలహాలను, సూచనలను ఈ కమిటీ స్వీకరిస్తోంది. ఛైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సెంటర్ ఫర్ క్రిమినాలజీ అండ్ జస్టిస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆశా ముకుందన్, ప్రొఫెసర్ బాలకృష్ణ, గడ్డం ఝాన్సీ, రుక్మిణి రావు, సునితా కృష్ణన్, సోని కుట్టి జార్జి సభ్యులుగా ఉన్నారు. కమిటీ తన నివేదికను అక్టోబర్ 15లోపు సమర్పించనుంది.

Advertisement