- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డా. రెడ్డీస్ నుంచి కరోనాకు ట్యాబ్లెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి ఫావిపిరవిర్ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. ‘అవిగాన్’ బ్రాండ్ పేరుతో 200ఎంజీ మోతాదులో ఈ ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టినట్టు, దీని ధర ట్యాబ్లెట్‌కు రూ. 99 లని కంపెనీ వెల్లడించింది. రెండేళ్ల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ఔషధం పూర్తి ప్యాక్ 122 ట్యాబ్లెట్లతో లభిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి 42 పట్టణాల్లో ఈ ట్యాబ్లెట్లను హోమ్ డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. ఇదే క్రమంలో సెప్టెంబర్ నాటికి కొవిడ్-19 చికిత్స కోసం మరో రెమ్‌డెసివిర్ ఔషధం కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించింది.
జపాన్‌కు చెందిన కంపెనీ ఫ్యూజీఫిల్మ్‌తో డా.రెడ్డీస్ ఒప్పందంలో భాగంగా వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా భారత్‌లో అవిగాన్ ట్యాబ్లెట్లను తయారు చేయడం, విక్రయించడం, పంపిణీ చేసేందుకు ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్లను జపాన్ నుంచి దిగుమతి చేసి విక్రయిస్తున్నట్టు, రానున్న రోజుల్లో వీటిని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. కొవిడ్-19 బారిన పడి ఓ మాదిరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ట్యాబ్లెట్లను ఉపయోగించేలా డీసీజీఐ అనుమతి ఉందని కంపెనీ స్పష్టం చేసింది.