జాగ్రత్తలు తప్పనిసరి.. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది : డాక్టర్ లావణ్య

by Sridhar Babu |
Dr. Lavanya
X

దిశ, ఓదెల: కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా జనం ఏమాత్రం భయపడడం లేదని, మాస్కు ధరించకపోవడమే కాకుండా, కనీసం భౌతికదూరం కూడా పాటించడం లేదని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఉందని ఓదెల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ లావణ్య హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరిస్తూ, భౌతికదూరం పాటించడం వల్లనే కరోనాను కట్టడి చేయగలం అని డాక్టర్ లావణ్య అన్నారు. మంగళవారం ఆమె ‘దిశ’ విలేకరితో మాట్లాడుతూ.. జనంలో కరోనా భయం ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించారు. ఇప్పుడు జనాల్లో ఎక్కడా కరోనా భయం కనిపించడం లేదు. వారం సంతలు, దేవాలయాలు, ఒక్కటేమిటి అన్నీ తెరుచుకున్నాయి. దీంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, పార్టీ బహిరంగ సభలు యథేచ్చగా కొనసాగుతున్నాయి.

జనాలు ఎక్కడపడితే అక్కడ గుంపులుగుంపులుగా ఉంటున్నారు. అయితే, అందుకు తగ్గట్లు జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదని డాక్టర్ లావణ్య అన్నారు. కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వైరస్ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు నెలలు ప్రజలు అప్రమత్తంగా ఆమె కోరుతున్నారు. కరోనా సృష్టించిన విలయం అంతా, ఇంతా కాదని, కళ్లముందే స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులను కోల్పోయామని తెలిపారు. తొలి రెండో విడతల్లో కరోనా కల్లోలం సృష్టించిందన్నారు. ఇప్పుడు ప్రపంచం ముందు థర్డ్ వేవ్ రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉందని, ఈ థర్డ్ వేవ్ ఎంతటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడే చెప్పలేమని కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలని, మహమ్మారి దరిచేరకుండా చూసుకోవాలని డాక్టర్ లావణ్య కోరుతున్నారు.

Advertisement

Next Story