- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంపర్ ఆఫర్.. అక్కడ డజన్ల కొద్ది బాయిలర్ కోళ్లు ఫ్రీ
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తుంటే.. చింతలూరు గ్రామస్తులు కోడి కూరతో సంతోషంగా దావత్ చేసుకుంటున్నారు. కిలోల చొప్పున కాకుండా ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను పట్టుకొచ్చారు.. అదీ ఉచితంగా. ఉచితంగా కోళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు దరకాసు చెరువు అలుగుపారింది. దీంతో పక్కనే ఉన్న ప్రదీప్ రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫారం మొత్తం నీట మునిగింది. ఫారంలో ఉన్న కోళ్లు వరద ప్రవాహానికి పక్కనే ఉన్న పొలాలు, గ్రామాల్లోకి కొట్టుకుపోయాయి. మిగిలిన కోళ్లను స్థానిక ప్రజలు తీసుకెళ్లడం గమనార్హం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను పట్టుకుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను గ్రామస్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.