దోస్త్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

by Shyam |
Chairman Limbadri
X

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ రెండవ విడత ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును పొడిగిస్తన్నట్టుగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది. సెప్టెంబర్ 6 వరకు విద్యార్థులు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం కల్పిచారు. ఇప్పటి వరకు రెండవ విడతలో 42,067 మంది విద్యార్థులు ఆన్ లైన్‌లో రిపోర్టింగ్ అందించారని ఉన్నతవిద్యామండలి చైర్మన్ లింబాద్రి ప్రకటించారు. మూడవ విడత కోసం 8,695 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 6,306 మంది అప్లికేషన్లను సబ్మిట్ చేశారని తెలిపారు. సెప్టెంబర్ 24 నుంచి మూడవ విడత సీట్ల కేటాయింపులు చేపడుతామని చెప్పారు.

Advertisement

Next Story