గడువు పెంచిన ‘దోస్త్’

by Anukaran |
గడువు పెంచిన ‘దోస్త్’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డిగ్రీ విద్యార్థుల కళాశాల అడ్మిషన్లలో భాగంగా దోస్త్ మూడో దశ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 9వ తేదీ వరకు పెంచారు. ఇప్పటికే మొదటి దశ, రెండవ దశ పూర్తయింది. అభ్యర్థులకు ఆయా కళాశాలల్లో సీట్టు ఖరారు అయ్యాయి. పలువురికి సీటు ఖరారు అయిన విద్యార్థులు ఆసక్తి చూపనట్టు తెలుస్తోంది.

దోస్త్ పరిధిలో మొత్తం 986 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 4 లక్షల 9 వేల 456 సీట్లు ఉంటే ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా ఒక లక్షా 45 వేల సీట్లను కేటాయిస్తే అందులో.. ఒక లక్షా 7 వేల 645 మంది మాత్రమే సీట్లను కన్‌ఫామ్ చేసుకున్నారు. ఇక రెండో విడతలో 60,539 మందికి సీట్లు కేటాయించారు. అయినా.. ఇంకా 2 లక్షల 41 వేల 266 సీట్లు మిగిలి ఉన్నాయి. దీంతో అధికారులు గడువు పెంచినట్టు తెలుస్తోంది.

మూడో దశలో భాగంగా అక్టోబర్ 10వ తేదీ వరకు వెబ్ ఆప్సన్స్‌ ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 15వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. అలాగే దోస్త్ స్పెషల్ ఫేజ్ కింద కౌన్సెలింగ్ కోసం అక్బోబర్ 15 నుంచి 26 వరకు రిజిస్ట్రేషన్లను స్వీకరించనున్నారు. ఇందులో భాగంగానే వెబ్ ఆప్షన్స్ 15వ తేదీ నుంచి 27 వరకు అందుబాటులో ఉంటాయి. అక్బోబర్ 30న సీట్ల కేటాయింపు జరగనున్నట్టు దోస్త్ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed