‘శ్రీశాంత్ కోసం తలుపు తెరిచే ఉంది’

దిశ, వెబ్‌డెస్క్: 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పట్టుబడ్డ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ పై నిషేధం ముగిసిన విషయం తెలిసిందే. ఏడేళ్ల తర్వాత అతడి పై నిషేధం ముగియడంతో ఎలాగైన జాతీయ జట్టులో ఆడేందుకు ప్రయత్నిస్తానని శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు.

దీంతో కేరళ క్రికెట్ అసోసియేషన్ (Kerala Cricket Association) కోచ్ టిను యోహన్నన్ స్పందిస్తూ.. శ్రీశాంత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే తిరిగి దేశీయ సీజన్లో తీసుకోవడమనేది ఆనందకరం అంటూ ఈఎస్పీఎన్‌క్రిక్‌ఇన్ఫో (ESPNcricinfo‌)కి చెప్పారు.‘మేము శ్రీశాంత్‌తో సన్నిహితంగా ఉన్నాము.. అతనిని పరిశీలిస్తాము.. కానీ తిరిగితీసుకోవడం అనేది అతని ప్రతిభ, ఫిట్‌నెస్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ తలుపు తెరిచి ఉంది.” అంటూ టిను యోహన్ననన్‌ స్పష్టం చేశారు.

Advertisement