- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డూడ్లింగ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన పదేళ్ల కేరళ గర్ల్
దిశ, ఫీచర్స్: కేరళ, త్రిసూర్‌కు చెందిన 10 ఏళ్ల తేజస్వి అభిలాష్.. నిమిషంలోపే డిజిటల్ డూడుల్ పూర్తిచేసి రికార్డు సృష్టించింది. ఆసియాలోనే ఈ ఫీట్ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచి, ఇండియా అండ్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టి) విద్యార్థి అయిన 10 ఏళ్ల తేజస్వి అభిలాష్‌కు చిత్రాలు గీయడమంటే ఇష్టం. అయితే డిజిటల్ ఆర్ట్ గురించి అంతగా తెలియని తేజస్వి.. ఆమె మేనమామ అర్జున్ ఐప్యాడ్‌లో పెన్సిల్ సాయంతో అసైన్‌మెంట్స్ గీయడాన్ని చూసి, తను కూడా ప్రయత్నించాలనుకుంది. ఈ క్రమంలో ఐపెన్సిల్ ఉపయోగించి డిజిటల్ ఆర్ట్ ఎలా గీయాలో మామయ్య దగ్గర నేర్చుకుంది. తొలిగా డిజిటల్ ఇలస్ట్రేషన్ అప్లికేషన్‌ను ఉపయోగించడానికి కష్టపడినా క్రమంగా డిజిటల్ ఆర్ట్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలోనే 59 సెకన్లలో ఐప్యాడ్‌లో డిజిటల్ డూడుల్ ఆర్ట్ సృష్టించి.. దేశంలోనే కాక ఆసియాలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ప్లేస్ దక్కించుకుంది.
‘కార్టూన్ బొమ్మలు, వివిధ ఆకృతులు గీయడాన్ని ఇష్టపడతాను. డ్రాయింగ్, పెయింటింగ్‌కు ప్రతీరోజు కొంత టైమ్ కేటాయిస్తాను. రికార్డుల కోసం ప్రయత్నించాలని మా అమ్మ కవిత సూచించడంతో దాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని కొత్త రికార్డ్ సెట్ చేయాలనుకున్నాను. ఆర్ట్‌లో మరింత వేగాన్ని పొందడానికి, 30 – 40 సెకన్లలోపు డూడ్లింగ్ పూర్తి చేయడానికి శిక్షణ ఇచ్చారు. రికార్డ్ కోసం ప్రాక్టీస్ చేసే సమయంలో A4 సైజు ట్యాబ్ స్క్రీన్‌లో డూడ్లింగ్ చేశాను. ఈ రికార్డులు రావడం సంతోషంగా ఉంది. యానిమేషన్ సహా డిజిటల్ ఇలస్ట్రేషన్‌పై మరింత నాలెడ్జ్ పొందాలనుకుంటున్నాను. ఈ కళారూపాలను వివరంగా నేర్చుకున్న తర్వాత భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని తేజస్వి తెలిపింది.