కరోనాపై పోరుకి మాజీ ఎంపీ హరిబాబు, పారిశ్రామిక వేత్తల విరాళం

by srinivas |
కరోనాపై పోరుకి మాజీ ఎంపీ హరిబాబు, పారిశ్రామిక వేత్తల విరాళం
X

విశాఖపట్టణం మాజీ ఎంపీ, బీజేపీ ఏపీ మాజీ చీఫ్ కంభంపాటి హరిబాబు తన మిత్రులతో కలిసి 3.67 కోట్ల రూపాయల విరాళాలు సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేశారు. హరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి 20.44 లక్షల రూపాయలను పీఎం కేర్స్‌కు విరాళంగా పంపించారు. తన మిత్రులు, వ్యాపారవేత్తలు (అవంతీ ఫీడ్స్ లిమిటెడ్ ప్రతినిధి ఎం.ఇంద్రకుమార్, దేవీ సీఫుడ్స్ లిమిటెడ్‌కు చెందిన పి.బ్రహ్మానందం, ఇసాయి ఫార్మా ప్లాంటు ప్రతినిధి డాక్టర్ గిరీష్ దీక్షిత్, కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి టి.వల్సరాజ్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ ప్రతినిధి జి.మురళీకృష్ణ) తో కలిసి 3.47 కోట్ల రూపాయలు సేకరించారు. మొత్తం 3.67 కోట్ల రూపాయల విరాళం అందజేశారు.

మరోవైపు గ్రీన్‌కో తరపున 5 కోట్ల విరాళం చెక్కును ఆ సంస్థ ఎండీ చలమశెట్టి అనిల్ సీఎం జగన్‌కు ఇచ్చారు. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరపున 2 కోట్ల రూపాయల విరాళం ఆ సంస్థ ఛైర్మన్ పెన్నా ప్రతాపరెడ్డి సీఎం జగన్‌కు అందజేశారు. ప్రభుత్వ జూనియర్ (ఇంటర్), డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లోని ఒప్పంద అధ్యాపకులు వారి రెండు రోజుల వేతనం మొత్తం 1.15 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ఏపీ వైద్య మండలి తరపున కోటి విరాళమిచ్చారు. ఆంధ్రా ఆర్గానిక్స్ తరపున కోటి విరాళమిచ్చారు. కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ తరపున సిబ్బంది ఏడు రోజుల వేతనం 20 లక్షలు సీఎం సహాయ నిధికి అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed