- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'ఇండియా సిరీస్ తర్వాత క్రికెట్‌పై ద్వేషం పెరిగింది'
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ జట్టు స్పిన్నర్ డామ్ బెస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ టెస్టు జట్టు సభ్యడైన డామ్ బెస్ చక్కని ప్రదర్శన చేశాడు. శ్రీలంక, ఇండియాలపై 4 టెస్టులు ఆడిన డామ్ బెస్ 17 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే ఇండియా పర్యటన తనకు క్రికెట్ పైనే విరక్తి కలిగించేలా చేసిదని డామ్ బెస్ వ్యాఖ్యానించాడు.
‘ఇండియా పర్యటనలో చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ నేర్చుకున్న పాఠాలు తప్పకుండా తనకు భవిష్యత్‌లో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. భారత పర్యటన తర్వాత నేను క్రికెట్‌ను ద్వేషించడం మొదలు పెట్టాను. ఎందుకంటే బయోబబుల్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాను. బయోబబుల్‌లో కేవల క్రికెట్ గురించి మాత్రమే చర్చ నడిచేది. మంచి ప్రదర్శన చేసినపుడు బాగాన ఉంటుంది. కానీ విఫలం చెందినప్పుడు మాత్రం అక్కడ ఉండలేము. బయటకు వెళ్లాలని అనిసిస్తుంది. అందుకే నేను ఇబ్బంది పడ్డాను’ అని డామ్ బెస్ చెప్పాడు.