కరోనా వైరస్ కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుందా?

by sudharani |
కరోనా వైరస్ కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ ట్రీట్‌మెంట్‌లో వెంటిలేటర్లతో పాటు మరో యంత్రం కొరత కూడా వైద్యులను ఇబ్బంది పెడుతోంది. అవే డయాలసిస్ యంత్రాలు. వైద్యుల నివేదికల ప్రకారం చాలా మంది కొవిడ్ 19 పేషెంట్లు ప్రస్తుతం మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారని తెలిసింది. దీంతో డయాలసిస్ యంత్రాల అవసరం పడుతోంది. కానీ అవి కూడా అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. మరి నిజంగా కరోనా వైరస్ కిడ్నీల మీద ప్రభావం చూపిస్తోందా?

సైన్స్ మేగజైన్ ప్రకారం కొవిడ్ 19 సీరియస్ కేసుల్లో కిడ్నీ వైఫల్యం కచ్చితంగా కనిపిస్తోందని, ముఖ్యంగా దాని వల్లే వారు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసింది. అయితే వైరస్ నేరుగా కిడ్నీలను దాడి చేస్తోందా లేక వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల అన్ని భాగాల్లాగే కిడ్నీ కూడా పాడవుతోందా అనే దాని మీద స్పష్టత లేదు. అయితే కిడ్నీల్లో ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ఏసీఈ2) ఎక్కువ మొత్తంలో కనిపిస్తుండటంతో ఈ వైరస్ కిడ్నీలను నేరుగా దాడి చేస్తుండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది కరోనా సోకకముందే కిడ్నీ సమస్యలు ఉన్న పేషెంట్లలో మాత్రమే కనిపించిందనేది మరో వాదన. వుహాన్‌లో చనిపోయిన వారిలో 27 శాతం మందికి కిడ్నీ ఫెయిల్ అవడాన్ని బట్టి చూస్తే మాత్రం కరోనాకి, కిడ్నీకి ఏదో సంబంధముందని అనుకుంటున్నారు. అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లలో కిడ్నీలు ముందుగా ప్రభావితమవుతున్నాయని కరోనా వైరస్ కిడ్నీలను నేరుగా ప్రభావితం చేస్తుందనడానికి వీరే నిదర్శనమని మరికొందరు డాక్టర్లు అంటున్నారు. ఏది ఏమైనా పరిస్థితి చేయి దాటకముందే పరీక్షలు చేయించుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు.

Tags: kidney, corona, covid, dialysis, effect, ventilators

Advertisement

Next Story

Most Viewed