- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్లు, చెవుల ద్వారా కరోనా వ్యాపిస్తుందా?
సామాన్య ప్రజల నుంచి శాస్త్రవేత్తల వరకు కరోనా వైరస్ ఒక పజిల్‌లాగా మారింది. దీన్ని ఎలా కట్టడి చేయాలా? అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే, ఏం చేస్తే ఇది వ్యాపిస్తుందో తెలుసుకుని అవి చేయకుండా ఉండాలని సామాన్య ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాము చేయబోయే ప్రతి చిన్న పని ప్రారంభానికి ముందు ఇలా చేస్తే కరోనా వ్యాపిస్తుందా అనే ప్రశ్నను మనసులో వేసుకుంటున్నారు. ముక్కు ద్వారా వైరస్ ప్రవేశించి వ్యాధి కలిగిస్తోందని తెలిసి దాన్ని అడ్డుకోవడానికి మాస్క్ ధరిస్తున్నారు. అయితే మరి చెవులు, కళ్లు తెరిచే ఉంటున్నాయి కదా… మరి వాటి ద్వారా గాలి వెళ్లినపుడు వైరస్ సోకదా అనే ప్రశ్న కొందరికి తట్టింది. దీని గురించి శాస్త్రవేత్తలు స్పష్టతనిచ్చారు.
కళ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది కానీ చెవుల నుంచి వ్యాపించడం చాలా తక్కువ అని వారు అంటున్నారు. మీకు దగ్గరలో ఎవరైనా దగ్గినపుడు లేదా తుమ్మినపుడు ఆ తుంపర కంటి వరకు చేరే రీతిలో ఉంటే మాత్రం వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువ. అంతేకాకుండా చేతులను అక్కడ ఇక్కడ పెట్టి తర్వాత అదే చేతులతో కళ్లు నలపడం ద్వారా కూడా వైరస్ వ్యాపించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాధి సోకిన వ్యక్తి కన్నీళ్లలో కూడా ఈ కరోనా వైరస్ బ్రతికే ఉంటుందని వారు స్పష్టం చేశారు. అయితే ఇలా జరగకుండా ఉండటానికి తరుచుగా చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని కఠినంగా పాటించడం ముఖ్యమని వారు సలహా ఇస్తున్నారు. కావాలంటే కళ్లద్దాలు ధరించడం వల్ల కొంత ఉపశమనం ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ వారు సిఫారసు చేస్తున్నారు.
ఇక చెవుల విషయానికి వస్తే, చెవులలో ఎక్కువ ద్రవరూపేణా కణజాలం లేదు కాబట్టి వైరస్ వ్యాపించడం చాలా అరుదు అని అంటున్నారు. కాకపోతే చెవుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, చీము లాంటివి కారుతున్నా వాటి ద్వారా వైరస్ చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి కళ్లు, చెవులు అని విడివిడిగా కాకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్త పాటించడం చాలా అవసరం.