డాక్టర్లపై భౌతిక దాడులు నశించాలి.. జనగామలో భారీ ర్యాలీ

by Shyam |
డాక్టర్లపై భౌతిక దాడులు నశించాలి.. జనగామలో భారీ ర్యాలీ
X

దిశ, జనగామ: డాక్టర్లపై జరుగుతున్న దాడులను నివారించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ జిల్లా బృందం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వైద్యులపై అనేక దాడులు జరుగుతున్నాయని, ఇటువంటి వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్యులకు చట్టబద్ధత తీసుకువచ్చి డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు. జనగామలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మూడు నెలల శిశువు మృతి చెందిన సంఘటనలో శిశువుకు చెందిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై దాడి చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది పై జరిగిన దాడిని నిరసిస్తూ, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసనల్లో భాగంగా జనగామ నెహ్రూ పార్క్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు అంబులెన్స్ లతో తలకు బ్యాండేజ్ కట్టుకొని ప్రైవేటు మెడికల్ అసోసియేషన్, ప్రైవేట్ ల్యాబ్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్య బృందాలు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాలోని ప్రైవేటు వైద్యశాలల్లో రెండు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపి సేవలను నిలిపి వేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ వైద్య బృందం వైద్యులు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ , శ్రీకాంత్, లింగమూర్తి, శంకర్, బాలాజీ, స్వప్న , రాజమౌళి, లక్ష్మీ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed