- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీపీఈ కిట్లలో.. ఆ వైద్యుడి అరచేతులు ఎలా అయ్యాయంటే?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ఈ ప్రపంచంలో అడుగుపెట్టి ఇప్పటికే 8 నెలలు కావస్తోంది. అయినా కరోనా కేసుల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను, కుటుంబ సభ్యులను లెక్కచేయకుండా.. కరోనా బాధితులకు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి రక్షణకు వైద్యులు, వైద్య సిబ్బంది.. పీపీఈ కిట్లు ధరిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా, గంటల తరబడి ఆ పీపీఈ కిట్లు ధరించడం వల్ల వారి శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫేస్ మాస్క్‌లు గంటల తరబడి ధరించడం వల్ల తమ ముఖం ఎంతగా గాయపడుతుందో చూపిస్తూ ఆ మధ్య ఓ నర్సు ఫొటోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్‌లో ఓ వైద్యుడు పీపీఈ కిట్ల వల్ల తన అర చేతులు ఎలా మారిపోయాయో చూడండి అంటూ ఓ ఫొటో పంచుకున్నాడు.
ఒకటి, రెండు కాదు.. ఏకంగా 8 నెలలుగా వైద్య సిబ్బంది.. పీపీఈ కిట్లు ధరించి వైద్య సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వైద్యుడు తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘అత్యంత తేమ వాతావరణంలో ఎక్కువగా చెమటలు పట్టిన కారణంగా పీపీఈ తీయగానే నా చేతులు ఇలా కనిపించాయి’ అని డాక్టర్ సయ్యద్ ఫైజన్ అహ్మద్ పేర్కొన్నారు. కొవిడ్-19, కొవిడ్ వారియర్స్, డాక్టర్ తదితర హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఆయన తన పోస్టుకు జతచేశారు. దీంతో నెటిజన్ల నుంచి ఆ వైద్యునికి ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేకాదు.. మీరు నిజమైన హీరోలని, మీరు చేస్తున్న సేవకు, త్యాగానికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
My hands after doffing #PPE due to profuse sweating in extremely humid climate.#COVID19 #Covidwarrior #Doctor pic.twitter.com/wAp148TkNu
— Dr Syed Faizan Ahmad (@drsfaizanahmad) August 24, 2020