గుండెపోటు వచ్చిన పేషెంట్‌కు వైద్యం చేస్తున్న డాక్టర్‌కు స్ట్రోక్.. ఇద్దరూ మృతి

by Sumithra |   ( Updated:2021-11-28 01:40:49.0  )
hart-1
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా గాంధారిలో పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గుండెపోటు వచ్చింది. దీంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అందరిని కలచి వేసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన ఒకరికి ఆదివారం తెల్లవారు జామున హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం అతడిని గాంధారిలోని ఎస్వీ జీవ నర్సింగ్ హోమ్ కు తరలించారు. ఆ పేషేంట్ కు ట్రీట్మెంట్ చేస్తుండగా డా.లక్ష్మణ్ కు కూడా గుండె పోటు వచ్చి మృతిచెందాడు. దీంతో ఆ పేషెంట్ ను కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. డాక్టర్ కు ఇదివరకు స్టెంట్ వేసినట్టు తెలిసింది. డాక్టర్ తన సొంత క్లినిక్ లోనే మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. డా. లక్ష్మణ్ నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తూ సొంతంగా గాంధారిలో ప్రాక్టీస్ నడుపుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed