నెల్లూరు జీజీహెచ్‌లో డాక్టర్ కామలీలలు.. విచారణకు ఆదేశం

by srinivas |   ( Updated:2021-06-04 05:26:12.0  )
నెల్లూరు జీజీహెచ్‌లో డాక్టర్ కామలీలలు.. విచారణకు ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్ :నెల్లూరు జిల్లాలోని జీజీహెచ్ ఆస్పత్రిలో మెడికల్ విద్యార్థినులకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఓ డాక్టర్ కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినులకు తరచూ ఫోన్లు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఆ సంభాషణకు సంబంధించిన కాల్ రికార్డింగ్ బయటకు రావడంతో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటన నిన్న సాయంత్రం వెలుగుచూడగా ఏపీ ప్రభుత్వం శుక్రవారం చర్యలకు ఉపక్రమించింది.

కొత్తగా ఏర్పాటైన కమిటీలో నెల్లూరు ఏసీఎస్‌ఆర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అడిషనల్ డైరెక్టర్ సాంబశివరావు, ఇద్దరు ఫ్రొఫెసర్లు ఉన్నారు. ప్రస్తుతం లైంగికవేధింపుల ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. సాయంత్రానికళ్ల నివేదిక అందించాలన్నారు.

ఇదిలాఉండగా, జీజీహెచ్‌లోని ఓ డాక్టర్ మెడికల్ విద్యా్ర్థినులకు కాల్ చేసి.. తనతో బీచ్‌కు రావాలని.. డ్యూటీ అయ్యాక రోజు కాల్స్ చేయాలని.. తన గదిలో ఏసీ ఉందని రావచ్చుగా అని.. చెప్పినట్లు వినకపోతే కాళ్లు చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి తీసుకెళ్తానని మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed