నిద్రలేమితో బాధపడుతున్నారా.. ఎవరెవరు ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా..?

by sudharani |   ( Updated:2021-06-23 06:04:25.0  )
Insomnia telugu
X

దిశ, వెబ్‌డెస్క్: నిద్రను నిర్లక్ష్యం చేయకండని మన పూర్వీకులు ఊరికే అనలేదు. సుఖనిద్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మీ వయసు ప్రకారం ప్రతిరోజు ఎంతసేపు నిద్రించాలి మీకు తెలుసా..? లేకుంటే ఈ వాస్తవాలు తెలుసుకోండి.

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అంచనాల ప్రకారం… ప్రతి రోజు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే సుఖనిద్ర అత్యవసరం. దేశంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) నిద్రించే సమయంలో నియమాలు ఉండాలని చెప్తోంది. సుఖనిద్ర లేక దేశంలో 40 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమితో దీర్ఘకాలిక వ్యాధులకు వచ్చి అవకాశం ఉంది.

నిద్రలేమి వల్ల హఠాత్తుగా బరువు పెరగడం. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, బీపీ పెరగడం, హైపర్ టెన్షన్ మొదలు కావడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, అంతేకాకుండా హృదయ సంబంధ వ్యాధులు పెరిగి చివరకు మరణానికి కూడా దారితీస్తుంది.

ఇలాంటి సమస్యలు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. అందుకే నిద్రలేమి జాతీయ అరోగ్య సమస్యగా మారింది. నిద్రలేమిని నిర్లక్ష్యం చేస్తే రోగాలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. అందుకే నిద్రలేమికి నేషనల్ స్లీప్ ఫౌండేషన్ కొన్ని నిబంధనలు తెలియజేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం…

1. అప్పడే పుట్టిన పసిపిల్లల నుండి మూడు నెలల పిలల్లల వరకు 14 నుండి 17 గంటలు నిద్రపోయేలా చూడాలి.
2. సంవత్సరం పిల్లల నుండి రెండేళ్ల పిల్లల వరకు 11 నుండి 14 గంటలు నిద్రపోవాలి.
3. నాలుగేళ్ల నుంచి 11 సంవత్సరాల పిల్లలు 12 నుండి 15 గంటలు నిద్రపోవాలి.
4. టీనేజీ పిల్లలు అంటే 14 నుండి 17 ఏళ్ల వయసున్న వారు, 8 నుండి 10 గంటలు నిద్రించాలి.
5. 18 ఏళ్ల నుండి 25 ఏళ్ల వయసు వారు 7 నుండి 9 గంటలు నిద్ర తప్పనిసరి.
6. 26 నుండి 64 ఏళ్ల వారు 7 నుండి 9 గంటలు నిద్రపోవాలి.
7. అలాగే 64 ఏళ్ల పైబడినవారు కూడా 7 నుండి 8 గంటల నిద్రించడం వల్ల అరోగ్యంగా ఉంటారని ఓ నివేదిక చెపుతోంది.

Diabetes : షుగర్ వల్ల నోరు కట్టేసుకొంటున్నారా..? అయితే ఇవి తినండి

Advertisement

Next Story

Most Viewed