- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నెంబర్ ప్లేట్ల రంగులకు అర్థం తెలుసా..?

దిశ, వెబ్‌డెస్క్ : మన తెలుగు రాష్ట్రాల్లోని వాహనాలకు నెంబర్ ప్లేట్లు ఏ రంగులో ఉంటాయి..? తెలుపు, పసుపు కలర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆ కలర్స్ ప్లేట్లపై నలుపు రంగులో నెంబర్లు వేస్తారు. ఈ రంగులే కాకుండా కొనిసార్లు గ్రీన్, బ్లూ, రెడ్ నెంబర్ ప్లేట్లు కనిపిస్తుంటాయి. మరికొన్నిటికి బాణం గుర్తులు ఉంటాయి. అయితే ఏ కలర్ నెంబర్ ప్లేట్ ఏ వాహనానికి వాడుతారు? వాటికి సంకేతం ఏంటో తెలుసుకుందాం..
ఆర్టీఏ అధికారులు డొమెస్టిక్, కమర్షియల్, ట్యాక్సీ ప్లేట్, విదేశీ వాహనాలు, మిలటరీ వాహనాలకు వేర్వేరుగా నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారు. వాహనాన్ని బట్టి నెంబర్ ప్లేట్ ఇష్యూ చేస్తుంటారు అధికారులు. ఏ కలర్ నెంబర్ ప్లేట్ ఏ వాహనానికి కేటాయిస్తారో చూద్దాం.
వైట్ ప్లేట్ మీద బ్లాక్ లెటర్స్
రెగ్యూలర్ గా మనం చూసే వాహనాలకు వైట్ ప్లేట్లు బ్లాక్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ లేదా నాన్ కమర్షియల్ కార్లకు మాత్రమే వీటిని వాడతారు. వస్తువులను ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి, ప్రయాణికులను ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చడానికి ఈ నెంబర్ ప్లేట్ వాడరు.
పసుపు ప్లేట్ పై నలుపు అక్షరాలు
పసుపు నెంబర్ ప్లేట్ మీద నల్లటి అక్షరాలు కమర్షియల్ వాహనాలకే సెట్ అవుతాయి. వస్తువుల రవాణాకు, ప్యాసింజర్ల కోసం వాడుతుంటారు. ఓలా, యూబర్ క్యాబ్స్ లాంటి క్యాటగిరీకి ఇవి వస్తాయి.
గ్రీన్ ప్లేట్ మీద వైట్ లెటర్స్
ఇవి చాలా కొత్తగా కనిపిస్తున్న నెంబర్ ప్లేట్లు. దీనిని బట్టి ఆ వాహనం ఎలక్ట్రిక్ వెహికల్ అని కన్ఫామ్ చేసుకోవచ్చు. లీగల్ గా తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ కు ఇవి అమరుస్తారు.
బ్లూ ప్లేట్ మీద వైట్ లెటర్స్
విదేశీ డిప్లొమేట్స్ వాడే వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్ ఉంటుంది. వీరికి రాష్ట్రానికి సంబంధించిన కోడ్ కు బదులు దేశాన్ని రిప్రజెంట్ చేసే కోడ్ ఉంటుంది.
పైకి వెళ్లే బాణం గుర్తుతో కనిపించే నెంబర్ ప్లేట్
న్యూ ఢిల్లీలో ఉండే రిజిష్టర్డ్ మిలటరీ వెహికల్ కు ఈ నెంబర్ ప్లేట్ ఉంటుంది. ముందు లేదా రెండో అక్షరం ఉండే స్థానంలో బాణం గుర్తు ఉంటుంది. ఆ కోడ్ లో ఒక్కో డిజిట్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది.
రెడ్ ప్లేట్ మీద తెల్లటి అక్షరాలు
రెడ్ ప్లేట్ మీద తెల్లని అక్షరాలతో ఉన్న ప్లేట్ ను టెంపరరీ రిజిష్ట్రేషన్ కింద వాడతారు. ఆర్టీఓ నుంచి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ పొందేంతవరకూ అది తప్పదు. ఈ టెంపరరీ రిజిస్ట్రేషన్ ఒక నెల మాత్రమే వ్యాలిడ్ గా ఉంటుంది. అయితే అన్ని రాష్ట్రాలు ఇలాంటి టెంపరరీ రిజిష్టర్డ్ వెహికల్స్‌ను రోడ్ల మీదకు అనుమతించవు.