- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రదేశాల్లో నలుపు తగ్గాలంటే ఇలా చేయండి
దిశ, వెబ్‌డెస్క్ : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారు అందానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. గ్లామర్ గా కనిపించేదుకు మార్కెట్ లో లభించే రకరకాల కాస్మోటిక్స్‌ని వాడుతుంటారు. అయితే కొందరిలో ఎన్ని క్రీములు, లోషన్స్ వాడినా కొన్ని ప్రదేశాల్లో నలుగు రంగు పోదు. అలాంటి వారికి కోసం ఇంట్లోనే చిన్న చిట్కాలు ఉపయోగించి తెల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
వాతావరణంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ కారణంగా చర్మంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం పెరుగుతుంది. దీంతో తెల్లగా ముఖం కూడా నల్లగా మారిపోతుంది. కొందరికి ప్రత్యేకంగా నోటి చుట్టు ప్రాంతం కూడా నలుపుగా మారుతుంది. అలాంటి వారు రసాయనిక లోషన్స్ వాకుండా వంటింటి చిట్కాలు పాటిస్తే చర్మాన్ని కాపాడుకున్నవాళ్లు అవుతారు.
ఇలా చేయండి..
వేరు శనగ పిండికి నలుపును తగ్గించే గుణం ఉంటుంది. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ పిండి తీసుకొని, అర టీస్పూన్ పసుపు పొడి, కొద్దిగా పాలు లేదా నీరు వేసి పేస్ట్ తయారు చేసుకోండి. తరువాత మిశ్రమాన్ని నలుపుగా ఉన్న ప్రాంతంలో పూసి 15 నిమిషాలు నానబెట్టండి. ఆ తరువాత చల్లటి నీటితో అక్కడ శుభ్రం చేసుకోండి. అలాగే ఓట్స్ చర్మంలోని చనిపోయిన కణాలను తొలగించి చర్మానికి ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది. దీనితో ముఖాన్ని, నలుపు ప్రాంతాలను కాంతివంతంగా చేసుకోవచ్చు. టూత్ పేస్ట్‌లో కొద్దిగా ఓట్ మీల్, ఆలివ్ ఆయిల్, ఆరెంజ్ జ్యూస్ వేసి ముఖం మీద నెమ్మదిగా మర్దన చేయండి. తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే శరీరం కాంతివంతంగా తయారు అవుతోంది. అలాగే బొప్పాయి, నిమ్మరసం మిశ్రమంతో మర్ధన చేసినా ఫలితం ఉంటుంది. బంగాళదుంపలోనే బ్లీచింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ముక్కలుగా చేసి 20 నిమిషాలు నలుపు ప్రదేశాల్లో మసాజ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. టమోటో రసంతో మర్ధన చేసుకున్నా చర్మంలోని నలుపుదనాన్ని తగ్గుంచుకోవచ్చు. ఇలా ఇంట్లో లభించే వంటింటి వస్తువులతోనే నల్ల మచ్చలను తేలికగా తగ్గించుకోవచ్చు.