'బ్రీత్ ఎనలైజర్లు ఉపయోగించొద్దు'

by Shamantha N |   ( Updated:17 March 2020 1:55 AM  )
బ్రీత్ ఎనలైజర్లు ఉపయోగించొద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను కట్టడి చేసే కార్యక్రమాల్లో భాగంగా బ్రీత్ ఎనలైజర్లను ఉపయోగించవద్దని మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులకు ఆ రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (ట్రాఫిక్) ఆదేశాలు జారీ చేశారు. వాటి ద్వారా కరోనా సోకినవారి నుంచి ట్రాఫిక్ పోలీసులకు సోకే అవకాశమున్నదని, అందువల్ల వాటిని ఉపయోగించొద్దని ఆయన పేర్కొన్నారు. ముంబై, నవీ ముంబై, పూణె, థానే, ఔరంగాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 మంది పోలీస్ కమిషనర్లకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags: Maharashtra, traffic cops, breathalyzer, coronavirus, order



Next Story

Most Viewed