పరిమితికి మించి ఉల్లి నిల్వలొద్దు

by Shyam |
పరిమితికి మించి ఉల్లి నిల్వలొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉల్లిగడ్డల ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల దగ్గర నిల్వలు ఉంచుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హోల్‌సేల్ వ్యాపారులు గరిష్టంగా 25 టన్నులు (250 క్వింటాళ్ళు), రిటైల్ వ్యాపారులు రెండు టన్నులు (ఇరవై క్వింటాళ్ళు) మించి నిల్వ చేసుకోరాదని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధరల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఉల్లిగడ్డల నిల్వలకు సంబంధించి గతంలో జారీ చేసిన నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వ్యాపారులకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని, మన దేశంలో పండే ఉల్లిగడ్డల నిల్వలకు మాత్రమే ప్రభుత్వ ఆంక్షలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఉల్లి ధరలు పెరుగుతున్నందున సామాన్యులకు ఇవి అందుబాటులో ఉండేందుకు ఆంక్షలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ ఉత్తర్వుల్లో అనిల్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed