సమాచారం ఇవ్వకుండా.. పంపిణీ చేయొద్దు 

by Shyam |   ( Updated:2020-04-04 22:47:22.0  )
సమాచారం ఇవ్వకుండా.. పంపిణీ చేయొద్దు 
X

దిశ, మహబూబ్‌నగర్: తమకు సమాచారం ఇచ్చిన తర్వాతనే దాతలు వస్తువులను పంపిణీ చేయాలని పురపాలక కమిషనర్‌ సురేందర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాతలు,స్వచ్ఛంద సంస్థలు వస్తువులు, ఆహారం పంపిణీ చేస్తున్న సందర్భంగా సామాజిక దూరం పాటించడం లేదని, ఈ నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వస్తువుల ప్యాకింగ్‌ సమయంలో కూడా శుభ్రత పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. పేదలకు వస్తువులు పంపిణీ చేయాలనుకునే దాతలు ముందుగా తమ సంస్థ పేరు, పంపిణీ చేస్తున్న వ్యక్తుల పేర్లు పురపాలకశాఖకు తెలియజేసి గుర్తింపు కార్డులు పొందాలని, తమ పర్యవేక్షణలో వస్తువులు పంపిణీ చేయాలని కమిషనర్‌ సూచించారు. ఈ సూచనలను స్వచ్ఛంద సంస్థలు, దాతలు పాటించాలని, లేకుంటే ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags: help, charities, information, Don’t give anything, mahabubnagar, municipal

Advertisement

Next Story